డాలర్లకే క్రూడాయిల్
Actor ProfilePolitician

డాలర్లకే క్రూడాయిల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా
Oneindia Telugu19 Jul 2026
డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా

ఇరాన్-అమెరికా వార్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. తాజాగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 70 డాలర్లకు పడిపోయింది. అయినా భారత్ లో మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం లేదు. ఆ విధంగా చమురు సంస్ధలకు కోట్ల రూపాయలు ఆర్జించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ దోపిడీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి..!ఈ ఏడాది ఇరాన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ (Crude Oil) రేట్ల పెరుగుదలను సాకుగా చూపి మరీ పెట్రోల్ రేట్లు పెంచేసిన కేంద్రం.. ఇప్పుడు అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో రేట్లు తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ఫైర్ అయ్యారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గినా ఆ ప్రయోజనం దేశంలో వినియోగదారులకు ఎందుకు బదిలీ చేయడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇరాన్ డీల్ తో కుప్పకూలిన చమురు ధరలు..! అయినా ట్రంప్ కు వీడని కష్టాలు..!ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు $70 వద్ద-అంటే దాదాపు యుద్ధానికి ముందునాటి స్థాయికి-చేరుకున్నందున, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ పూరీని విజయసాయిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పెట్రోల్ లీటరుకు ₹116 చెల్లిస్తున్నారని ఆయనకు గుర్తుచేశారు. ఇది వారి జేబులకు తీవ్ర భారాన్ని కలిగిస్తోందన్నారు. సాధ్యమైనంత వరకు వారికి ఉపశమనం కల్పించాలని సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు

డ లర లక క ర డ య ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in