షాపులో కూర్చుని మనోజ్ కంగారు పడుతుంటాడు. డబ్బు కోసం వెళ్లిన రోహిణి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోందని మనోజ్ మరింతగా హైరానా పడుతుంటాడు. ఇంతలో జీఎస్టీ ఆఫీసర్లు వచ్చి షాప్ సీజ్ చేస్తామని, ఇదిగో పేపర్స్ అని ఇస్తారు. వెంటనే ఖాళీ చేయండని అనడంతో మనోజ్ మరింతగా బెదిరిపోతాడు. నా భార్య వస్తుంది.. ఓ పది నిమిషాలు టైం ఇవ్వండని మనోజ్ ప్రాధేయపడతాడు. కానీ ఆఫీసర్స్ మాత్రం వినరు. సీజ్ చేయాల్సిందే అని అంటారు. ఇంతలో రోహిణి వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది.. అందుకే స్విచ్ ఆఫ్ వస్తోంది.. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెబుతుంది. అకౌంట్లో డబ్బులున్నాయి.. ఈ చెక్ రాసివ్వు అని మనోజ్‌కి రోహిణి చెబుతుంది. మనోజ్ కంగారు పడుతూ చెక్ ఇస్తుంటాడు. సరిగ్గా రాసివ్వు.. లేదంటే అదో సమస్య అవుతుంది అని రోహిణి అంటుంది. సరే ఇప్పుడు ఈ చెక్ తీసుకుంటున్నాం.. బౌన్స్ అయితే కేసు అవుతుందని వారు చెప్పి వెళ్లిపోతారు. థాంక్స్ రోహిణి.. నీ వల్లే గండం గట్టెక్కావ్.. అని రోహిణికి బిస్కెట్లు వేస్తుంటాడు మనోజ్. దీనికి ఏం తక్కువ లేదు.. ఈ విషయాలన్నీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అని రోహిణి అంటుంది.అప్పు ఎలా తీర్చాలి.. అవును.. లేదంటే బాలుగాడు ఏడ్పిస్తూనే ఉంటాడు అని మనోజ్ అంటాడు. ఈ డబ్బు ఎక్కడిది అని మనోజ్ అడిగితే.. అప్పు తెచ్చా.. త్వరగా తీర్చేయాలని రోహిణి చెబుతుంది. అప్పా? అని మనోజ్ ఆశ్చర్యపోతాడు. ఇలాంటి టైంలో అప్పు కాకపోతే ఆకాశం నుంచి ఊడిపడతాయా? అని రోహిణి కౌంటర్లు వేస్తుంది. అంటే త్వరగా తీర్చేయాలా? అని మనోజ్ అంటే.. అవును.. అతి కష్టం మీద తీసుకు వచ్చా.. త్వరగా ఇచ్చేయాలని అని రోహిణి వెళ్లిపోతుంది. మరి అప్పు ఎలా తీర్చాలో చెప్పలేదే అని మనోజ్ అనుకుంటాడు.మీనాకి చెప్పిన బాలు.. మరో వైపు బాలు స్కూల్లో జరిగిందంతా మీనాకి చెబుతాడు. చింటూని, సుగుణమ్మని కలిసిన
Actor ProfilePolitician
డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసిన బాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•11 Jul 2026
డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసిన బాలు, మీనా.. కార్లు కడిగే పనిలో పెడతా.. ప్రభావతికి సత్యం కౌంటర్లు