
Eenadu•25 Jul 2026
డ్రగ్స్ కు వ్యతిరేకంగా మారథాన్ .. 6 కి.మీ. పరుగుపెట్టిన సీఎం విజయ్తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదకదవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం విజయ్ హాజరయ్యారు. మాదకద్రవ్యాలు వీడుదాం... పరుగు మొదలుపెడదాం అంటూ మారథాన్‌ను ప్రారంభించారు. ఔత్సాహికులతో కలిసి విజయ్ సుమారు 6 కి.మీ. పరుగుపెట్టారు. 52 ఏళ్ల వయసులో విజయ్ ఉత్సాహంగా పాల్గొని అంతదూరం పరిగెత్తడం విశేషమని అధికారులు ప్రశంసించారు. ఈ వార్త చదివారా: ఈ బంగారు గుర్రం రూ.70 లక్షలు