
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మారథాన్ (Marathon)లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తమిళనాడు సర్కారు శుక్రవారం చెన్నైలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ 6 కిలోమీటర్ల మేర (Stop Drugs marathon) పరుగెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వాలంటీర్లు సహా వేలాదిమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారథాన్ ప్రారంభానికి ముందు విజయ్ అక్కడి వారితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని.. ప్రతిరోజు తప్పకుండా రన్నింగ్ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతివ్వాలని కోరారు. ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మారథాన్‌లు, మినీ మారథాన్‌లు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: తాగొచ్చిన పెళ్లికొడుకు చెంప ఛెళ్లుమనిపించిన వధువు గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు