డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే
Actor ProfileActor

డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే
Chitrajyothy23 Jun 2026
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెబుతూ కొత్త పోస్టరు విడుదల చేశారు. యాక్షన్‌, ఎమోషన్‌, స్టైలిష్‌ విజువల్స్‌తో ఈ చిత్రం రాబోతోందని, ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో యశ్‌ కనిపించనున్నారని దర్శకురాలు గీతూ ఇప్పటికే చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణంలో కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రఽధారులు. రవిబస్రూర్‌, తనిష్క్‌ బగ్చి, విశాల్‌ మిశ్రా సంగీతం అందిస్తున్నారు. Buchi Babu Sana: చిరంజీవి గారింట్లో నేషనల్‌ అవార్డు చూడాలనేది నా కోరిక Fathers Day: చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు