డేకేర్ కాదు.. నరకకూపం.. ఏడిస్తే బాత్రూమ్ లో బంధించి.. నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు.. పసిపిల్లల
Actor ProfilePolitician

డేకేర్ కాదు.. నరకకూపం.. ఏడిస్తే బాత్రూమ్ లో బంధించి.. నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు.. పసిపిల్లల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డేకేర్ కాదు.. నరకకూపం.. ఏడిస్తే బాత్రూమ్ లో బంధించి.. నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు.. పసిపిల్లలపై అమానుషత్వం
Zee Telugu30 Aug 2026
డేకేర్ కాదు.. నరకకూపం.. ఏడిస్తే బాత్రూమ్ లో బంధించి.. నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు.. పసిపిల్లలపై అమానుషత్వం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bengaluru Daycare Abuse: బెంగళూరులోని ఓ డేకేర్ సెంటర్ లో 2 నుంచి 3ఏళ్ల వయస్సున్న చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపింది. ఏడుస్తున్న చిన్నారులను వాషింగ్ మెషీన్ లో కూర్చోబెట్టడం.. టాయిలెట్ జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు చల్లడం.. బాత్రూమ్ లో బంధించడం వంటి శిక్షలు విధించారాన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన నగరంలోని క్యాప్ జెమినీ సంస్థ హెచ్ఏఎల్ క్యాంపస్ లో నిర్వహిస్తున్న డేకేర్ కేంద్రంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు ఏడవకుండా అల్లరి చేయకుండా వారిని భయపెట్టి మౌనంగా ఉంచేందుకు ఇలాంటి అమానుష చర్యలు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డేకేర్ లో పనిచేస్తున్న ఐదుగురు మహిళా సంరక్షకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ వ్యవహారంపై కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ ఆఫీసుల్లో నడుస్తున్న డేకేర్ కేంద్రాల భద్రత, పర్యవేక్షణపై ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. దర్యాప్తు జరుగుతుందన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

డ క ర క ద నరకక ప ఏడ స త బ త ర మ ల బ ధ చ న ట ల క ట య ల ట జ ట స ప ర త న ళ ల పస ప ల లల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in