డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా
Actor ProfilePolitician

డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా

Total News1
Movie Updates0
Sources1
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా
Sakshi14 Jun 2026
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్‌సీఈఆర్టీ (SCERT)లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది. ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం. టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా

డ ఎస స మ త ర ల సమ ధ న చ ప పల ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in