డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ
Actor ProfileActor

డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ
TV9 Telugu29 Jun 2026
డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ

అందాల భామ ఇనయా సుల్తానా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ కంటెస్టెంట్, త్రీ రోజెస్ సిరీస్‌లో తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను పంచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గతంలో ఒక వ్యక్తితో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ, తనను డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించుకున్నాడని ఇనయా సుల్తానా సంచలన విషయాలు బయటపెట్టింది. గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ సమయంలో ఎందుకు అలా బోల్డ్‌గా ఫోటోలు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. తాను ఆ సంబంధాన్ని పూర్తి స్థాయిలో నమ్మానని, పెళ్లి చేసుకుని, పిల్లలతో జీవితాంతం అతనితోనే గడపాలని కలలు కన్నానని ఇనయా సుల్తానా తెలిపింది. ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది అందుకే అంత ధైర్యంగా తన భాగస్వామిని ప్రపంచానికి చూపించాలనుకున్నానని తెలిపింది. అయితే, అది కేవలం తొమ్మిది నెలల్లోనే బట్టబయలైన పెద్ద నమ్మకద్రోహమని ఆమె చెప్పుకొచ్చింది. తాను సర్వం ఇచ్చినప్పటికీ, అవతలి వ్యక్తి తనను కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అంటే పేరు, డబ్బు కోసం ఉపయోగించుకున్నాడని ఇనయా సుల్తానా స్పష్టం చేసింది. ఈ మోసం వల్ల తాను ఆర్థికంగా కూడా నష్టపోయానాని, ఒక వ్యాపారం ప్రారంభించడం కోసం తన నాలుగు గాజులు అమ్మి డబ్బులు ఇచ్చానని, ఆ వ్యాపారం సదరు వ్యక్తి వలనే ఆగిపోయిందని, తాను పెట్టుబడి పెట్టిన డబ్బులు, గాజులు కూడా తిరిగి రాలేదని తెలిపింది. ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా