
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. IND W Vs BAN W T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసక్తికర పోరులో ఐదు వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన గెలుపును నమోదు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత మహిళా జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు వేగంతో చేసిన 53 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 16.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది భారత మహిళల జట్టు. అటు బౌలింగ్‌లో రాధా యాదవ్ 3 వికెట్లు, శ్రీ చరణీ చివర్లో చేసిన 2 వికెట్లతో బంగ్లాదేశ్ 136/8 పరుగులకే పరిమితమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు తడబాటుతో ప్రారంభమైన ఊపందుకోవడానికి ఇబ్బంది పడింది. దిలారా అక్తర్ త్వరగా అవుటవ్వగా, జువైరియా ఫెర్దౌస్ (33), శోభనా మోస్టరీ (22) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, రాధా యాదవ్ నేతృత్వంలోని భారత స్పిన్నర్లు మిడిల్, చివరి ఓవర్లలో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. నిగర్ సుల్తానా కీలక వికెట్‌తో సహా, రాధా 3/28 అనే అద్భుతమైన ప్రదర్శనతో బంగ్లాదేశ్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి ఓవర్‌లో శ్రీ చరణీ కూడా రెండుసార్లు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 136 స్కోరుతో ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత్ పలు క్యాచ్‌లను జారవిడిచినా, వారి బౌలర్లు వాటి ప్రభావం స్కోరుపై పడకుండా చేయడంలో విజయం సాధించారు. 137 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్