
“ఒక సినిమా థియేటర్లలో విడుదలవుతుంది… తర్వాత OTTలోకి వస్తుంది.” ఇన్నాళ్లూ ప్రేక్షకులకు తెలిసిన సినిమా ప్రయాణం ఇదే. కానీ హాలీవుడ్‌లో ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నమైన సంఘటన జరిగింది. జర్మనీలో సాధారణ విడుదలకు అడ్డంకులు ఎదుర్కొన్న ఒక వివాదాస్పద సినిమాను… ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ నేరుగా తన X (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో 48 గంటల పాటు పూర్తి సినిమాగా స్ట్రీమ్ చేశాడు. దాంతో “X ఇక సోషల్ మీడియా మాత్రమేనా… లేక రేపటి OTT ప్లాట్‌ఫామా?” అనే చర్చకు ఈ సంఘటన తెరతీసింది. అసలు ఈ సినిమా ఏమిటి? జర్మనీలో ఎందుకు వివాదం రేగింది? ఎలాన్ మస్క్ ఎందుకు దీనిని ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నాడు? ఈ వ్యవహారం వెనుక రాజకీయాలు, వ్యాపార వ్యూహం ఏమిటి? ఈ కథను కేవలం సినిమా వివాదంగా చూస్తే అసలు విషయం మిస్ అవుతాం. ఇందులో ఎలాన్ మస్క్ ఆలోచన ఉంది… రాజకీయాలు ఉన్నాయి… వ్యాపార వ్యూహం ఉంది… భవిష్యత్తులో సినిమాలు ఎలా విడుదలవుతాయనే ప్రశ్న కూడా ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కంటే, దీని చుట్టూ జరిగిన పరిణామాలే ఎక్కువ చర్చకు దారి తీశాయి. ఇవన్ని కలవడంతోనే Citizen Vigilante ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎలాన్ మస్క్ తనను తాను చాలాకాలంగా “Free Speech Absolutist” గా అభివర్ణించుకుంటున్నారు.ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించనంత వరకు వారి అభిప్రాయాలను లేదా కంటెంట్‌ను ప్రభుత్వాలు, సంస్థలు అడ్డుకోకూడదని నమ్మే వ్యక్తి. అందుకే సెన్సార్‌షిప్‌కు సంబంధించిన అంశాలపై ఆయన తరచూ బహిరంగంగా స్పందిస్తుంటారు. ప్రభుత్వాలు, సెన్సార్ బోర్డులు లేదా పెద్ద టెక్ కంపెనీలు ఏదైనా కంటెంట్‌ను అడ్డుకుంటే… అలాంటి కంటెంట్‌కు X వేదిక కావాలన్నదే ఆయన బహిరంగ వైఖరి. ఈ సినిమా జర్మనీలో సాధారణ విడుదలకు అవసరమైన రేటింగ్ పొందలేకపోవడంతో అక్కడ ప్రదర్శనకు పరిమితులు ఏర్పడ్డాయి. దర్శకుడు ఉవే బోల్ ఈ విషయాన్ని ప్రస్తావించిన కొద్ది రోజుల్లోనే మస్క్