టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్
Actor ProfilePolitician

టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్

Total News4
Movie Updates0
Sources1
ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది
Vaartha14 Jun 2026
ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది

Mallikarjun Kharge : రాజకీయాల్లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే జీవితంలో ఎవరికీ తెలియని ఒక చీకటి కోణం, గుండెను పిండేసే విషాద గాథ ఉంది. ఆయన కేవలం ఆరేళ్ల వయసులో

విమానం టాయిలెట్ లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Vaartha13 Jun 2026
విమానం టాయిలెట్ లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Ahmedabad Airport: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున సాగుతున్న బంగారపు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక

గుర్బాజ్ సెంచరీ.. అఫ్గానిస్థాన్ స్కోర్ ఎంతంటే
Vaartha13 Jun 2026
గుర్బాజ్ సెంచరీ.. అఫ్గానిస్థాన్ స్కోర్ ఎంతంటే

IND vs AFG Match : ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు విచిత్రమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి, అద్భుతమైన

టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్ పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Vaartha13 Jun 2026
టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్ పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

MK Stalin: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ తీరుపై డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కేంద్రంలోని బీజేపీకి ‘జిరాక్స్ కాపీ’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. read also: Supriya Sule: కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం నిర్వహించిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో ఎం.కె. స్టాలిన్ ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి బీజేపీ ఎలాంటి అప్రజాస్వామిక వ్యూహాలను అమలు చేస్తోందో, ఇప్పుడు తమిళనాడులో సీఎం విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అధికార పార్టీ ‘షాపింగ్’ కు తెరలేపిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి కనీసం మూడు వారాలు (21 రోజులు) కూడా కాకముందే, ఓటర్ల వేలి సిరా గుర్తు కూడా చెరగకముందే నలుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు టీవీకే గూటికి చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. వారికి ఎలాంటి ఆఫర్లు ఇచ్చి పార్టీలోకి లాక్కున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా భద్రత పూర్తిగా క్షీణించిందని స్టాలిన్ ఆరోపించారు. ఇటీవల శ్రీవైకుంఠంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు నిందితులు కూడా అధికార టీవీకే పార్టీకి చెందినవారేనని స్పష్టం చేశారు. కనీసం నిందితులపై చర్యలు తీసుకోకపోగా, బాధితురాలినే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే శ్రేణుల నుంచే మహిళలకు రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారని