
Peddi : రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో చరణ్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే పెద్ది సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది. ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అని అంతా అంటున్నారు. ఇందుకు పలు కారణాలు ఉండగా ఓటీటీ కూడా ఒక కారణం. నిర్మాతలే ఈ విషయం ఒప్పుకున్నారు. సినిమా థియేటర్స్ లో రిలీజయిన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద హిట్ సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా నాలుగు వారాల గ్యాప్ తో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్, చిన్న సినిమాలు అయితే రెండు మూడు వారాలకే వచ్చేస్తున్నాయి. ఎలాగో నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చే సినిమా కోసం థియేటర్ కి వెళ్లి భారీ టికెట్ రేట్లు పెట్టి సినిమా చూడాలా అని ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేశారు. బాలీవుడ్ లో కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీకి రావాలని ఒక నిబంధన ఉంది. అది మన దగ్గర కూడా రావాలని పలువురు అడుగుతున్నా నిర్మాతలు ఓటీటీ సంస్థలు ముందే ఇస్తున్న డబ్బుల కోసం వాళ్ళు చెప్పిన రూల్స్ కి ఒప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు పెద్ది సినిమా ఆరు వారాల నిబంధనతో ఓటీటీలోకి రానుందని సమాచారం. పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయింది. లెక్కప్రకారం అయితే నెల రోజులు గ్యాప్ తో జులై మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ మూవీ యూనిట్ ఓటీటీ సంస్థతో మాట్లాడి ఇంకో రెండు వారాలు పెంచి జులై 16న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పించారని టాలీవుడ్ సమాచారం. ఇక హిందీ వర్షన్ అయితే బాలీవుడ్ ప్రకారమే 8