
RGUKT IIIT Results: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో సీట్లు సాధించిన విద్యార్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఏడాది ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అసాధారణ ప్రతిభతో దుమ్మురేపారు. read also: AP Rain Update : ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ ఈ విద్యా సంవత్సరంలో ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం మొత్తం 44,104 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మొత్తం 4,040 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో వీరికి ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, ఈసారి సీట్లు సాధించిన వారిలో ఏకంగా 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే ఆర్జీయూకేటీ ఆశయం ఈ ఫలితాలతో మరోసారి రుజువైందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సీట్లు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మంత్రి లోకేశ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమ ప్రవేశ పత్రాలను (Selection Letters) విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ rgukt.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే విద్యార్థుల సహాయార్థం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. HYD Illegal Gender Test: వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే