ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్
Actor ProfilePolitician

ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్

Total News1
Movie Updates0
Sources1
ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్ పై భారీ దాడికి కుట్ర
Eenadu17 Jun 2026
ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్ పై భారీ దాడికి కుట్ర

Attack plan on UFC event | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) 80వ పుట్టిన రోజు నేపథ్యంలో.. వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ (UFC) ఈవెంట్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో భారీ దాడికి కుట్ర పన్నిన విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే, దీన్ని ఫెడరల్‌ ఏజెంట్లు భగ్నం చేసి పలువురిని అరెస్టు చేశారు. ఈవెంట్‌కు నాలుగు రోజుల ముందు ఈ కుట్ర గురించి తమకు తెలిసిందని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ (Kash Patel) పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ఎగురవేయడంతో పాటు జనసమూహంపై కాల్పులు జరపాలని కొందరు ప్లాన్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి 19 ఏళ్ల యువకుడితో సహా ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. పలువురు అనుమానితుల నుంచి శక్తిమంతమైన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 మందికి చెందిన ఎన్‌క్రిప్టెడ్‌ టెక్ట్స్‌లు పరిశీలించారు. ఇందులో వైట్‌హౌస్‌ (White House)కు సంబంధించిన ఫొటోలు, మ్యాప్‌ల గురించి.. దాడి తర్వాత తప్పించుకునేందుకు ఉన్న అవకాశాలు, ఇతర మార్గాల గురించి వారు మాట్లాడుకోవడాన్ని గుర్తించారు. నిందితుల్లో ఒహాయో నివాసి అయిన 19ఏళ్ల టైసెన్‌ ప్రాపర్‌ ఒకడు. ఇటీవల అతడి ప్రవర్తనపై తల్లికి అనుమానం వచ్చింది. ప్రాపర్‌ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం.. గూఢచర్యం, హిట్‌ అండ్‌ రన్‌ మిషన్ల గురించి ఆన్‌లైన్‌లో కొందరితో అతడు మాట్లాడటాన్ని ఆమె గమనించారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులను ఆమె సంప్రదించారు. ఈ క్రమంలో ప్రాపర్‌ను అధికారులు అరెస్టు చేయగా.. విచారణ సమయంలో యూఎఫ్‌సీ ఈవెంట్‌పై దాడి చేసే ప్లాన్‌ గురించి వెల్లడించాడు. బృందంలోని వ్యక్తులకు ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో తేలింది. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకులు, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్‌ యంత్రాంగం వ్యవహరించిన తీరుతో నిరాశ