
వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. తను హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిత్ర కథేంటి? ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన త్రిమూర్తులు (వడ్డే నవీన్) కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేడు. నీతి నీజాయితితో ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడ కూడా పట్టుమని మూడు నాలుగు నెలలు నికరంగా ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. దాదాపు 55 సార్లు రకరకాల ఊర్లకు ట్రాన్స్ ఫర్ అవుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి అమలాపురం నుంచి అరకులో తన తండ్రి పనిచేసిన పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అనుకోకుండా గిరిజన అమ్మాయి ప్రియమ్మ అత్యాచారంకు సంబంధించిన కంప్లయిట్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, ఇందుకు సంబంధించిన ఓ ఫైల్ దొరుకుతుంది. ఈ కేసులోనే అత్యంత నిజాయితీగా ఉన్న తన తండ్రి శ్రీనివాసులు (దేవి శ్రీ ప్రసాద్) ప్రాణాలు కూడా కోల్పోతాడు. అయితే ఈ అత్యాచారం ఘటనకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కమలమ్మ (శిల్పా శిలస్కర్), ఆమె తనయుడు కాబోయే సీఎం సంతోష్ (వివేక్ రఘువంశీ) కారణం అని తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైన బాధిత ప్రియమ్మకు న్యాయం చేయాలని, కమలమ్మ, సంతోష్‌లకు కోర్టులో శిక్ష వేయించాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కమలమ్మతో ఎలా పోరాడాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బాధితురాలికి ఎలా న్యాయం చేశాడు అనేది మిగతా కథ. వడ్డే నవీన్
