టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
Actor ProfileActor

టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
Sakshi18 Jun 2026
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్

ప్రస్తుత తరం క్రికెట్‌లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్‌లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్‌ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. అరంగేట్రంలో అదుర్స్‌ పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవ‌ల అఫ్గానిస్తాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన భార‌త త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. త‌న తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధార‌ప‌డుతోంది. అత‌డికి స‌పోర్ట్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేస‌ర్లు ఉన్నారు. వీరు ముగ్గురు త‌ప్ప ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో నిల‌క‌డ‌గా రాణించే మ‌రొక ఫాస్ట్ బౌల‌ర్ లేడు. ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భార‌త్ పేస్ బౌలింగ్ క‌ష్టాలు తీరిన‌ట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అత‌డికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. ఐపీఎల్‌లో నో ఛాన్స్‌! గుర్నార్ బ్రార్‌.. 2023లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున‌ ఐపీఎల్ అరంగేట్రం చేసిన‌ప్ప‌టికి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఒకే

ట మ డ య క ద ర క న ఆరడ గ ల బ ల ల ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in