
తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న లీకుల రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఏఐసీసీ వేదికగా జరిగిన ఒక అనూహ్య పరిణామం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకే ఎసరు పెట్టే స్థాయికి చేరడం పొలిటికల్ సర్కిల్స్‌లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేసి బరిలోకి దించిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలే వెన్నుపోటుకు పాల్పడ్డారనే పక్కా ఆధారాలు ఢిల్లీ పెద్దలకు చిక్కాయి. ఈ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంపై రాహుల్ గాంధీ అత్యంత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ అంటే రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత నమ్మకమైన, విలువలతో కూడిన రాజకీయాలు చేసే సీనియర్ నాయకురాలిగా పేరుంది. మధ్యప్రదేశ్‌లో ఆమె నామినేషన్‌ను తిరస్కరించడానికి బేస్‌గా మారిన తెలంగాణ పాత ప్రైవేట్ కంప్లైంట్ వివరాలను.. ఇక్కడి కాంగ్రెస్ నేతలే స్వయంగా బీజేపీకి లీక్ చేశారనే అంశంపై ఏఐసీసీ ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించింది. పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాల వల్లనే పార్టీ జాతీయ స్థాయిలో ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీకి ప్రాథమికంగానే ఒక స్పష్టత వచ్చేసింది. తన సొంత ఎంపికపైనే దెబ్బకొట్టిన ఈ అంతర్గత శత్రువులను క్షమించే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారం కేవలం ఒక రాజ్యసభ సీటును కోల్పోవడం కాదు, రాహుల్ గాంధీ నాయకత్వానికే విసిరిన సవాల్‌గా ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. అందుకే, బాధ్యులపై చర్యలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ను రూట్ లెవెల్ నుండి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పాత్రపై తీవ్రమైన స్కృటినీ నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా