టీజీ బిల్డర్స్ అసోసియేషన్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
Actor ProfilePolitician

టీజీ బిల్డర్స్ అసోసియేషన్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

Total News1
Movie Updates0
Sources1
టీజీ బిల్డర్స్ అసోసియేషన్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
Andhra Jyothy16 Jun 2026
టీజీ బిల్డర్స్ అసోసియేషన్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌ను చర్చలకు ఆహ్వానించామని.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్‌ అండ్ బీలో రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టిందని విమర్శించారు. హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌ను చర్చలకు ఆహ్వానించామని.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్‌ అండ్ బీలో రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టిందని.. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట నిర్మించామని గొప్పలు చెబుతున్నారని, గుట్ట బిల్లులు కూడా రూ.350 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. బిల్లుల కోసం ఈనెల 18న చలో హైదరాబాద్‌కు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌ పిలుపునిచ్చిందని మంత్రి తెలిపారు. సీఎంతో మాట్లాడి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చామన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరగా.. ఈరోజు సాయంత్రం వరకు చర్చించుకుని నిర్ణయం చెబుతామని వారు చెప్పారన్నారు. పత్రికల్లో వార్తల కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తమపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బట్టకాల్చి మీద వేస్తే కాలిపోతామని అనుకుంటున్నారని అన్నారు. ‘మేం ఎంతకు కాంట్రాక్టులు ఇచ్చామో? చూస్తే హరీశ్ రావు తాను పొరపాటుగా మాట్లాడినట్లు ఒప్పుకుంటారు’ అంటూ మంత్రి కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

ట జ బ ల డర స అస స య షన త మ త ర క మట ర డ డ వ కట ర డ డ భ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in