టేకాఫ్ కు అంతా సిద్ధం
Actor ProfilePolitician

టేకాఫ్ కు అంతా సిద్ధం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టేకాఫ్ కు అంతా సిద్ధం
Andhra Jyothy5 Aug 2026
టేకాఫ్ కు అంతా సిద్ధం

నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. రన్‌వే, టెర్మినల్‌ భవనం, ఏటీసీ పనులన్నీ వంద శాతం పూర్తి వచ్చే నెలలో విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు ప్రధాని చేతులమీదుగా జాతికి అందించేందుకు ఏర్పాట్లు నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో గడువులోగా పనులన్నీ చకచకా పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం ఇచ్చే తుది షెడ్యూల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌, రన్‌వే, ఏటీసీ టవర్‌ పనులు వంద శాతం పూర్తయ్యాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జూలైలో మంచి రోజులు ఉన్నాయంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. భోగాపురం విమానాశ్రయంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్రధాని చేతులు మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో విమానాశ్రయ ప్రారంభోత్సవ షెడ్యూల్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయం నేవీ రక్షణ పరిధిలో ఉండడంతో అంతర్జాతీయ సర్వీసులకు, రాత్రి వేళల్లో విమాన రాకపోకలకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, విభజన హామీల్లో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జీఎంఆర్‌ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అత్యాధునిక రన్‌వే, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌, ఏకకాలంలో పదుల సంఖ్యలో విమానాలు పార్కింగ్‌ చేసే ఏప్రాన్‌ సౌకర్యాలతో ఈ ఎయిర్‌ పోర్టు రూపుదిద్దుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్లోబల్‌ కనెక్టివిటీ వస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న ఫార్మా హబ్‌లు, ఐటీ కారిడార్లు, ఆక్వా రంగాల్లో ఈ

ట క ఫ క అ త స ద ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in