టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి
Actor ProfilePolitician

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి.. సీసీటీవీ దృశ్యాల వైరల్
AP7AM26 Aug 2026
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి.. సీసీటీవీ దృశ్యాల వైరల్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కుటుంబ నివాసంపై అపరిచిత వ్యక్తి రాళ్ల దాడికి పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అభిషేక్ బెనర్జీ స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి.. అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు ఆగి, పెద్ద రాళ్లను తీసుకుని మొదటి అంతస్తు కిటికీలపైకి రెండుసార్లు బలంగా విసిరాడు. ఈ దాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన స్థలానికి సరిగ్గా పక్కనే కోల్‌కతా పోలీసులకు చెందిన భద్రతా కియోస్క్ ఉన్నప్పటికీ, ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎవరూ లేకపోవడం గమనార్హం.ఈ ఘటనపై ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దాడి వెనుక బీజేపీ ‘గూండాల’ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ‘గూండా రాజ్’ నడుస్తోందని ధ్వజమెత్తారు. "ఆ సమయంలో పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఎవరి ఆదేశాల మేరకు వారు అక్కడ లేకుండా పోయారు?" అని ఆయన నిలదీశారు. నేరస్థులకు రక్షణ కల్పిస్తున్నారా? అంటూ మండిపడ్డారు.అలాగే, నిందితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు వీలు కల్పించే 'పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్, 2026' నిబంధనలు బీజేపీ మద్దతుదారులకు కూడా వర్తిస్తాయా? లేదా? అని ప్రశ్నించారు. నెల రోజుల్లోనే రెండోసారిఅభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం నెల

ట ఎ స ఎ ప అభ ష క బ నర జ ఇ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in