
బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహం నిర్మాణం చుట్టూ అలుముకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రంగపూర్‌లో 81 అడుగుల భారీ రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ ఛాందసవాదులు, శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారన్న ఆరోపణలతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. 'జై శ్రీరామ్' నినాదాలతో ఢాకా వీధులు మారుమోగాయి.హిందూ మహాజోత్ సహా పలు హిందూ సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఢాకాలోని షాబాగ్ కూడలిలో సమావేశమైన నిరసనకారులు, అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రెస్ క్లబ్ వెలుపల మానవహారం నిర్వహించగా, ఢాకా రిపోర్టర్స్ యూనిటీ (డీఆర్‌యూ) భవనం దగ్గర మరో నిరసన కార్యక్రమం జరిగింది. మరోవైపు, రంగపూర్‌లో ప్రదర్శన చేపట్టేందుకు ప్రయత్నించిన హిందువులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.వివాదానికి కారణమైన విగ్రహ ప్రాజెక్ట్బంగ్లాదేశ్‌లోని ఉత్తర గైబంధా జిల్లా పలాశ్‌బరిలో శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా 81 అడుగుల శ్రీరాముడి విగ్రహంతో పాటు, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (సుమారు రూ. 15.6 కోట్లు) అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో రాముడి విగ్రహ నిర్మాణం ఇప్పటికే 80 శాతం పూర్తయింది.అయితే, ఇస్లామిక్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో పనులు నిలిపివేసినట్టు