జీవితంలో లక్ అనేదే ఉండదు.. కష్టపడాల్సిందే.. సమంత
Actor ProfileActor

జీవితంలో లక్ అనేదే ఉండదు.. కష్టపడాల్సిందే.. సమంత

Total News1
Movie Updates0
Sources1
జీవితంలో లక్ అనేదే ఉండదు.. కష్టపడాల్సిందే.. సమంత కామెంట్స్
TV9 Telugu15 Jun 2026
జీవితంలో లక్ అనేదే ఉండదు.. కష్టపడాల్సిందే.. సమంత కామెంట్స్

చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నటి, నిర్మాత సమంత రుత్ ప్రభు మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో తెరవెనుక పనిచేసిన ప్రతి ఒక్కరి అంకితభావాన్ని, అవిశ్రాంత కృషిని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా విజయం కేవలం నటులు, దర్శకులకే కాకుండా, నిజమైన హీరోలైన సాంకేతిక నిపుణులందరికీ చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. తనను, సినిమా బృందాన్ని ప్రోత్సహించడానికి హాజరైన ప్రేక్షకులకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా పూర్తవ్వడానికి పడే శ్రమను, ముఖ్యంగా చివరి ఐదు రోజులు నిర్మాతగా తాను అనుభవించిన ఒత్తిడిని ఆమె వివరించారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు దాని క్రెడిట్ నటులు, దర్శకులకు మాత్రమే దక్కుతుందని, అయితే ఈ వేదికను "సినిమాను విజయవంతం చేయడానికి పగలు, రాత్రి కష్టపడే నిజమైన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పే అవకాశంగా" తాను ఉపయోగించుకుంటానని సమంత అన్నారు. లాస్ట్ వన్ వీక్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లు మహేష్, శీను, అన్వేష్, వంశీ, కుషాల్ నిద్ర కూడా పోకుండా పనిచేశారని ఆమె ప్రశంసించారు. VFX టీమ్ నిఖిల్, వసంత్, ప్రహాస్ వంటి వారి కృషిని ఆమె ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వసంత్ అందించిన సంభాషణలు తనకు చాలా సహాయపడ్డాయని, తన సహజమైన నటనకు కారణం ఆ డైలాగులేనని ఆమె అన్నారు. ఆర్య, రాకేష్ వంటి డిస్ట్రిబ్యూటర్లు ప్రతి సమస్యకు పరిష్కారం చూపి, వెన్నంటి నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. సమంత మాట్లాడుతూ, తనకు ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని, అందుకే సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడటానికి తాను మరికొంత సమయం తీసుకుంటానని తెలిపారు. సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన ఓం, 90ల వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించిన ఉల్లాస్, సినిమాకు స్టైలింగ్ అందించిన