
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Gajalaxmi Rajayogam 2026 Effect Telugu: ఖగోళంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతూ ఉంటాయి.. ఈ క్రమంలో జూలై 2 గురువారం రోజు ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడింది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి, శుక్రుడు, బుధ గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీనికి తోడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశిస్తూ.. మకర రాశిలో సంచారం చేసింది.. సూర్యుడి నుంచి చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల సమయోగం కూడా ఏర్పడింది. ఈ అరుదైన గ్రహాల కూటమి కారణంగా 5 రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ధనలాభాలు కలగడమే కాకుండా.. వృత్తిపరమైన విజయాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశులవారికి ధన లాభాలు: వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ రాశి నుంచి మూడవ స్థానంలో శుక్ర, గురువుల ప్రభావం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరైతే వారి ఆత్మవిశ్వాసం, ధైర్యమైన నిర్ణయాల వల్ల విజయాలు కలుగుతాయి. కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారికి ఈ