
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, క్రమశిక్షణతో ఉంచేందుకు వీలుగా జరిమానా నిబంధనలను భారీగా కఠినతరం చేస్తోంది. 'జన విశ్వాస్ చట్టం 2026' కింద ఈ మార్పులు చేశారు. రైల్వేలో చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, నిబంధనల ఉల్లంఘనకు నగదు జరిమానాల ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోవడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ సవరణలకు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం లభించింది. రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఈ సమాచారాన్ని అందించింది. రైల్వే చట్టం, 1989లో చేసిన ఈ సవరణలను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అమలు చేయనున్నారు. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం, ఈ సవరించిన నిబంధనలు జూలై 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపై రైళ్లలో లేదా స్టేషన్లలో నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇకపై రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గట్టి షాక్ తగలనుంది. ఇప్పటివరకు ఉన్న కనీస జరిమానా రూ. 250 నుంచి రూ. 500 కి పెంచారు. ఈ కనీస జరిమానాతో పాటు వర్తించే ప్రయాణ ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా కట్టకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది. అంతేకాకుండా, వేరే వాళ్ల టికెట్‌పై ప్రయాణించినా కూడా రూ. 500 కనీస జరిమానా విధిస్తారు. దాంతో పాటు ఆ టికెట్‌ను జప్తు చేసి, అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అనధికారికంగా తిరుగుతూ సామగ్రి అమ్మే ఫెర్రీల వాళ్లకు, భిక్షాటన చేసే వారికి రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఇదే తప్పు చేస్తూ రెండోసారి పట్టుబడితే ఏకంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మహిళల భద్రతకు రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో