జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం
Actor ProfilePolitician

జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం
Asianet News Telugu5 Aug 2026
జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం

జులై నెల ప్రారంభం కావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెల లాగే ఈసారి కూడా నెల మొదటి తారీఖు అంటే, 1 జూలై నుంచి దేశంలో కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పుల ప్రభావం సామాన్య ప్రజల జేబులపై, వారి రోజువారీ ఫైనాన్షియల్ పనులపై నేరుగా పడనుంది. ఈ కొత్త అప్‌డేట్స్‌లో ఐటీఆర్ ఫైలింగ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1 జూలై 2026 నుంచి అమల్లోకి రాబోయే ఆ టాప్ ఫైనాన్షియల్ మార్పులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు టాక్స్ పేయర్స్ అయితే ఈ విషయం కచ్చితంగా నోట్ చేసుకోండి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారమ్‌లను నింపే పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక సంవత్సరం 2025-26 రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీగా జూలై 31 ఫిక్స్ చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే భారీగా లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జూలై 31 లోపు రిటర్న్స్ దాఖలు చేయకపోతే, డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ, దీని కోసం మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎవరి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందో, వారు రూ. 5,000 వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు. అలాగే రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ జరిమానా రూ. 1,000 వరకు ఉంటుంది. ఆధార్ కార్డ్ వాడుతున్న వారికి యుఐడిఎఐ ఒక సూపర్ ఆఫర్ ఇచ్చింది. ఆధార్ కార్డులో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయడానికి వసూలు చేసే ఫీజును తాత్కాలికంగా రద్దు చేశారు. గతంలో ఈ సర్వీస్ కోసం రూ. 75 ఫీజు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు 1 జూలై 2026

జ ల 1 న చ క త త ర ల స అలర ట అవ వకప త మ ర మన ల స అవ వడ ఖ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in