జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా
Actor ProfileActor

జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా
Chitrajyothy18 Jun 2026
జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా

ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా పరిచయం కాగా, కుమార్తె దివిజ 'వెంకట్రామయ్యగారి తాలూకా' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా జూలై నెలలో విడుదల కానుంది. ఈటీవీ ప్రభాకర్‌ (ETV Prabhakar) నటుడే కాదు దర్శక నిర్మాత కూడా. ఆయన పిల్లలు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటనను వృత్తిగా ఎంచుకున్నారు. ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్‌ (Chandrahaas) 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. అయితే నటన కంటే కూడా తన యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్‌. తాజాగా ప్రభాకర్ కుమార్తె దివిజ (Divija) కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తొలి చిత్రం 'వెంకట్రామయ్యగారి తాలూకా' షూటింగ్‌ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. అలానే 'హే చికితా' మూవీలోనూ దివిజ హీరోయిన్‌గా నటించింది. దివిజ ప్రభాకర్ హీరోయిన్‌ గా నటిస్తున్న 'వెంకట్రామయ్యగారి తాలూకా' సినిమాను సతీశ్‌ ఆవాల దర్వకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించారు. దినేశ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమా గురించి నిర్మాత కోమలి మాట్లాడుతూ, 'ఫోక్ సింగర్‌గా నాకంటూ ఓ గుర్తింపు ఉంది. సినిమా రంగం మీద మక్కువతో నిర్మాతగా నా ప్రయాణం మొదలు పెట్టాను. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశారు. వచ్చే నెలలో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నాం' అని అన్నారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, 'అందమైన ఒక పల్లెటూరులో వెంకట్రమయ్య అనే వ్యక్తి కుటుంబంలో జరిగే కథ ఇది. పరువుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఆయన. అయితే అతని కుటుంబంలోని వ్యక్తుల మధ్య బంధాలన్నీ డబ్బు ఆధారంగా కొనసాగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కని, పెంచి పెద్ద చేస్తే... చివరి దశలో ఆ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి చూస్తున్నాం. ఈ సినిమాలో తల్లిదండ్రుల గొప్పతనం చూపించబోతున్నాం' అని అన్నారు

జ ల ల వ కట ర మయ యగ ర త ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in