జూలై 7వ తేదీన బుధుడు మిథునంలో తిరోగమనం వల్ల వృషభ రాశి వారికి అనేక శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి బుధుడు రెండు, పంచమ భావాలకు అధిపతిగా పరిగణించబడతారు. ఈ సమయంలో రెండో భావాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బును తిరిగి పొందుతారు. మీ సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. జూలై నెలలో బుధుడి తిరోగమనం వల్ల మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. తన సొంత రాశిలో బుధుడి సంచారం కారణంగా మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి బుధుడు సప్తమ, దశమ భావాలకు అధిపతిగా ఉంటాడు. బుధుడు మిథున రాశిలో తిరోగమనం చెందే సమయంలో ఈ రాశుల ఉద్యోగులకు పనిలో కొత్త బాధ్యతలు రావొచ్చు. వ్యాపారవేత్తలు భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు అనేక ప్రయోజనాలు పొందొచ్చు. కొత్త వ్యక్తులతో మీరు సంబంధాలు ఏర్పరచుకుంటారు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు రావొచ్చు. మీన రాశి వారికి బుధుడు నాలుగు మరియు ఏడో స్థానానికి అధిపతిగా పరిగణించబడతాడు. ఈ బుధ సంచారం మీ జాతకంలోని నాలుగో భావంలో జరగనుంది. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీకు మానసిక ఒత్తిడికి తగ్గుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై
Actor ProfilePolitician
జూలైలో బుధుడి తిరోగమనంతో వృషభం సహా ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు రానున్నాయా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•21 Jul 2026
జూలైలో బుధుడి తిరోగమనంతో వృషభం సహా ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు రానున్నాయా