
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Jailer 2 Release Date: రజినీకాంత్ గతేడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీతో పలకరించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ కూలీ కనిపించేది కాసేపే. సినిమా మొత్తం తన కూతురు, స్నేహితుడిని చంపిన వాడిపై ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ బాగానే ఉన్న చేసిన బిజినెస్ దృష్ట్యా అనుకున్నంత రాబట్టలేకపోయింది. ఓ రకంగా కూలీ సినిమాకు కూలీ గిట్టుబాటు కాలేదు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ మూవీ చేస్తున్నాడు. ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. జైలర్ మూవీ ఎక్కడా ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కూడా రజినీకాంత్ ‘జైలర్’ కనిపించేది చాలా తక్కువే. ముఖ్యంగా మాఫియా, కుటుంబ అనుబంధాలు, ప్రతీకారం నేపథ్యంలో ‘జైలర్ 2’ సినిమా కూడా ఉండనుంది. అయితే ‘జైలర్ 2’ సినిమాకు ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తర్వాత సినిమా ఔట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన లోకేష్ కనగరాజ్ మరోసారి ఈ సినిమాను 25 నుంచి 25 రోజులు పాటు రీ షూట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రజినీకాంత్‌తో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. జైలర్ 2తో సౌత్ ఎంట్రీ ఇస్తున్న హృతిక్ రోషన్.. ముందుగా ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను