జైలర్ 2’ పూర్తి చేసిన హృతిక్ రోషన్
Actor ProfileActor

జైలర్ 2’ పూర్తి చేసిన హృతిక్ రోషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జైలర్ 2’ పూర్తి చేసిన హృతిక్ రోషన్
Eenadu25 Jul 2026
జైలర్ 2’ పూర్తి చేసిన హృతిక్ రోషన్

ఇంటర్నెట్‌ డెస్క్: టైగర్‌ కా హుకూం.. అంటూ ‘జైలర్‌’ చిత్రంతో తనదైన స్టైల్‌లో సందడి చేశారు రజనీకాంత్‌. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ (Jailer 2) రూపొందుతోన్న విషయం తెలిసిందే. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 11న ఈ సినిమా విడుదల కానుంది. ‘జైలర్ 2’ సినిమాతో రజనీకాంత్ (Rajinikanth), హృతిక్ రోషన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని అందరూ భావిస్తున్నారు. కానీ, దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం స్క్రీన్‌ పంచుకున్నారు. 1986లో విడుదలైన ‘భగవాన్ దాదా’ అనే హిందీ సినిమాలో వీరిద్దరూ నటించారు. అప్పుడు పదేళ్ల వయసున్న హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించాడు.ఈ సినిమాను హృతిక్ తండ్రి రాకేశ్‌ రోషన్ నిర్మించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి హృతిక్‌ మాట్లాడుతూ.. తన పక్కన ఉన్నది భారతీయ సినిమాలోనే ఒక అతిపెద్ద లెజెండ్ అనే విషయం అప్పట్లో తెలియలేదన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు