
ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కే సినిమాల లిస్ట్ చెబుతూ.. ‘జాంబిరెడ్డి’ సీక్వెల్, ‘మిరాయ్’ సీక్వెల్ ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కే సినిమాల లిస్ట్ చెబుతూ.. ‘జాంబిరెడ్డి’ (Zombie Reddy) సీక్వెల్, ‘మిరాయ్’ (Mirai) సీక్వెల్ ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ‘జాంబి రెడ్డి 2’ (Zombie Reddy 2) అయితే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ మొదలవుతున్నా... నిర్మాతలు భారీగా హంగామా చేస్తున్నారు. అందులోనూ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే.. ఎంతో కొంత హంగామా అయినా చేసి ఉండాలి. అలాంటిదేమీ లేకుండా సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ చేయడానికి కారణం ఏమై ఉంటుందో ఆ నిర్మాతకే తెలియాలి. అలాగే ఈ సీక్వెల్ దర్శకుడు కూడా మారినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబి రెడ్డి’ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడీ సీక్వెల్‌ను బాలీవుడ్ దర్శకుడు హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన సుపర్ణ్ వర్మ (Suparn Varma). కథ మాత్రం ప్రశాంత్ వర్మదే.. కానీ దర్శకత్వం మాత్రం ఈ బాలీవుడ్ దర్శకుడు చేస్తుండటంతో.. అనేకానేక అనుమానాలు వ్యక్తమవడం మాములే. ప్రశాంత్ వర్మ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు, సుపర్ణ్ వర్మ మేకింగ్ తోడవనుండటంతో.. ఈ సీక్వెల్‌పై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక పార్ట్ 1లో తేజ సజ్జా (Teja Sajja) సరసన ఆనంది నటించగా, ఈ పార్ట్ 2లో మాత్రం ఓ బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్