జింబాబ్వే కోచ్ గా బౌలింగ్ దిగ్గజం
Actor ProfileCelebrity

జింబాబ్వే కోచ్ గా బౌలింగ్ దిగ్గజం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జింబాబ్వే కోచ్ గా బౌలింగ్ దిగ్గజం
Sakshi1 Sept 2026
జింబాబ్వే కోచ్ గా బౌలింగ్ దిగ్గజం

జింబాబ్వే క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం, వెస్టిండీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్‌ కోట్నీ వాల్ష్‌ నియమించబడ్డాడు. జూన్ 23న జరిగిన జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, జూలై 1న అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది భారత్–శ్రీలంక వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనే వాల్ష్ జింబాబ్వే బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఆయన మార్గదర్శకత్వంలో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరిచి ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లను ఓడించి తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా సూపర్-8 దశకు చేరడంతో పాటు 2028 టీ20 ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు తమ శాశ్వత బౌలింగ్‌ కోచ్‌గా వాల్ష్‌ను నియమించింది. మరోవైపు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు మిగతా కోచింగ్‌ సిబ్బందిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించింది. హెడ్ కోచ్‌గా జస్టిన్‌ సమ్మన్స్‌ కొనసాగుతుండగా, అసిస్టెంట్ (బ్యాటింగ్) కోచ్‌గా డియాన్‌ ఇబ్రహీం, ఫీల్డింగ్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కోచ్‌గా స్టువర్ట్‌ మత్య్సకెనరీ తమ బాధ్యతలను కొనసాగించనున్నారు. కొత్తగా మాజీ ఆల్‌రౌండర్ చాము చిబాబను సీనియర్ టీమ్ మేనేజర్‌కు సహాయకుడిగా నియమించారు. అలాగే మాజీ కెప్టెన్ ఎల్టన్‌ చిగుంబర అండర్-19 జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం జింబాబ్వే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో అన్ని ఫార్మాట్ల సిరీస్ ఆడుతోంది. కొత్త కెప్టెన్ రిచర్డ్‌ నగరవ నాయకత్వంలో ఆ జట్టు హరారే టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్‌ 85 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు) ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు) హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు) డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్‌.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) అయ్యా నా కొడుకును చంపేశారయ్యా... జగన్ ముందు కన్నీరు పెట్టుకున్న

జ బ బ వ క చ గ బ ల గ ద గ గజ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in