
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. LPG New Rules and Regulations: మార్చి 2026లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం.. ఎల్బీపీ నుంచి పిఎన్‌జికి మారడానికి వినియోగదారులకు 90 రోజుల గడువును నిర్దేశించింది. ఇది జూన్ నెలాఖరుతో ముగుస్తుంది. అయితే, జూన్ 30 తర్వాత అన్ని ఎల్‌పిజి కనెక్షన్లు ఆటోమేటిక్‌గా నిలిపివేయబడతాయా లేదా అనే విషయాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. ఏఐ క్విక్ రీడ్: ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్‌ల ఎల్‌పిజి కనెక్షన్లు 30 జూన్ 2026 తర్వాత నిలిపివేయబడతాయని సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభుత్వం అటువంటి గడువును ప్రకటించనప్పటికీ, పిఎన్‌జి అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఎల్‌పిజి నుండి పిఎన్‌జికి మారాలనే నిబంధనను గ్యాస్ ఏజెన్సీస్ కంపల్సరీ చేశాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా యుద్దం కారణంగా ఎల్‌పీజీకి కొరతా తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ ప్లేస్‌లో పీఎన్‌జీని దశల వారీగా అమలు చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో గ్యాస్ కోసం విదేశాలపై ఎక్కువగా ఆధార పడకుండా మనం స్వయం సమృద్ది సాధించగలుతాము. పిఎన్‌జి నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో వినియోగదారులు క్రమంగా పిఎన్‌జికి మారాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2026లో ఒక ఉత్తర్వును జారీ చేసింది. "ఇందులో డబుల్ కనెక్షన్లు లేకుండా దీన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఒక వినియోగదారునికి ఇంట్లో PNG కనెక్షన్ ఉన్నట్లయితే, వారు కొత్త LPG