
‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్‌లో నిర్మాత డి.సురేష్ బాబు ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి.సురేష్ బాబు, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, డైరెక్టర్ దేవా కట్టా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. *నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’తో సమంతకి మంచి విజయం దక్కాలి. ‘ఓ.. బేబీ’తో సమంత, నందినీ కలిసి నాకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. రాజ్, హిమాంక్ చాలా కష్టపడ్డారు. జూన్ 19న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. *సమంత మాట్లాడుతూ* .. ‘నేను ఇకపై ఏడాదికి రెండు సినిమాలు అభిమానులకు అందించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఓ మంచి చిత్రాన్ని చేశాం. ఇప్పటి వరకు నేను నటిగా ఎంతో ఎంజాయ్ చేశారు. నిర్మాతకు ఉండే కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. గత వారం రోజులుగా మా టీం నిద్రపోవడం లేదు. ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి పని చేసింది. రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. రాజ్ అండ్ డీకే ఎప్పుడూ కష్టపడుతూ పని చేస్తూనే ఉంటారు. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్క అతిథికి ధన్యవాదాలు. నా మీద ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. జూన్ 19న