జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్ లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు..
Actor ProfileActor

జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్ లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు..

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్ లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు..
TV9 Telugu7 Sept 2026
జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్ లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు..

మాతృదేవోభవ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామర క్లాసిక్‌గా నిలిచిపోయింది. మాతృత్వాన్ని, త్యాగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కే. అజయ్ కుమార్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ఇటీవలే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను పంచుకున్నారు. సాధారణంగా సినిమా హిట్ అయితే దర్శకులు ప్రచారంలో ఉంటారు, కానీ అజయ్ కుమార్ మాత్రం దీనికి విరుద్ధం. ప్రచారంపై తనకు ఎప్పుడూ ఆసక్తి లేదని, పెద్ద హీరోలతో కలిసి పనిచేసినా ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని ఆయన తెలిపారు. గూగుల్‌లో కూడా తన ఫోటోలు చాలా తక్కువగా ఉంటాయని, అవి కూడా ఇతరులు పంపినవేనని ఆయన అన్నారు. ఈ ప్రచార విముఖత కారణంగానే మాతృదేవోభవ వంటి గొప్ప సినిమాకు తానే దర్శకుడని చాలామందికి తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయం ప్రస్తావనకు వచ్చింది. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా రాగాలెందుకే పాటంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా తనకు చెప్పారని అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్.. “నేను నీ ఫ్యాన్ అయ్యా, మీ మాతృదేవోభవ సినిమాతో ఎంత ఇంప్రెస్ అయ్యానో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే విపరీతమైన ఇష్టం. ఆయన కార్ లో నీ సీడీ లేకుండా ఉండదు” అని రాజమౌళి చెప్పినట్లు అజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. మాతృదేవోభవ ఒక మలయాళ చిత్రానికి రీమేక్. ఒక భారీ ఎమోషనల్ కథను ఒక కొత్త దర్శకుడికి అప్పగించడం మామూలు విషయం కాదని అజయ్ కుమార్ అన్నారు. అయితే, నిర్మాత కే.ఎస్. రామారావు తన మొదటి చిత్రం కొంగుచాటు కృష్ణుడు లో కామెడీతో పాటు

జ న యర ఎన ట ఆర క ఆ ప ట ట చ ల ఇష ట క ర ల ఆ స గ స డ ల క డ ఉ డద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in