
Jonnagiri Gold Biscuit News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది ఇకపై మార్కెట్లో విదేశీ బులియన్ తో పాటు 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' బంగారం కూడా సందడి చేయనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి విజయవంతంగా వెలికి తీసిన బంగారాన్ని శుద్ధి చేసి, రాష్ట్ర లోగో తో కూడిన అధికారికి బంగారు బిస్కెట్లను మార్కెట్లో విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, భారీ పెట్టుబడుల ఫలితంగా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. భూగర్భం నుంచి తీసిన ఖనిజాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేసి, ప్రస్తుతం 100 గ్రాములు, 500 గ్రాముల బరువుతో తొలి విడత బంగారం బిస్కెట్లు సిద్ధం చేశారు. రాష్ట్రంలో బంగారం తవ్వి, ఇక్కడే శుద్ధి చేసి మార్కెట్లో తేవడం ఇదే తొలిసారి. సాధారణంగా మనకొనే బంగారం ఎక్కడ తయారయిందో పట్టించుకోం. కానీ ఇకపై ఏపీ నెలలో పుట్టిన బంగారం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోబోతుంది. ఈ ప్రాజెక్టు విజయంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు.. ఇకపై బంగారం ఉత్పత్తి రాష్ట్రం అనే సరికొత్త మైలురాయి తోడవ్వనుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. స్థానికంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు అనుబంధ పరిశ్రమలు, రవాణా రంగం పుంజుకుంటాయి. రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చడం సహా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు నమ్మకం పెరుగుతుంది. జొన్నగిరి నుంచి వచ్చిన తొలి బంగారు బిస్కెట్లు కేవలం విలువైన లోహం మాత్రమే కాదు. ఈ పారిశ్రామిక ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది అని కూటమి ప్రభుత్వం చెబుతుంది