
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Thalassemia: తలసేమియా.. ఈ వ్యాధి గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ దీన్ని చిన్న సమస్యగా భావించకూడదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా ప్రభావం చేసే జెనెటిక్ రక్త వ్యాధి. అందుకే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి జాతకాలు కలవకున్నా పర్వాలేదు కానీ ఇద్దరూ తలసేమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేశంలో తలసేమియా కేసులు భారీగా పెరుగుతుండటం.. కలవరపెడుతోంది. ఈ వ్యాధి శరీరంలో సరిపడా రక్తాన్ని తయారు చేయలేకపోతుంది. అంటే తలసేమియా బారినపడి వ్యక్తి శరీరం తనంతతాను రక్తాన్ని రీప్రొడక్ట్ చేసుకోదు. దీంతో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఈ తలసేమియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆల్ఫా తలసేమియా, 2. బీటా తలసేమియా. 1. ఆల్ఫా తలసేమియా అనేది సైలెంట్ క్యారియర్. ఈ వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వీరు వ్యాధిని వ్యాప్తి చేసే వాహకాలుగా మాత్రమే ఉంటారు. ఆల్ఫా తలసేమియా ట్రైయిట్ లేదా మైనర్.. ఇది తేలికపాటి రక్తహీనత ఉంటుంది. సాధారణంగా ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని తీవ్రత పెరుగుతుంది. మధ్యస్థం నుంచి తీవ్రమైన రక్తహీనత, ఎముకల సమస్యలు, ప్లీహం వాపు వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఆల్ఫా తలసేమియా మేజర్..అనేది అత్యంత తీవ్రమైన రూపమని వైద్యులు చెబుతున్నారు. దీన్ని హైడ్రోప్స్ ఫెటాలిస్ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ప్రాణాంతకంగా మారుతుంది. 2. బీటా తలసేమియా మైనర్ ఇది తేలికపాటి రక్తహీనత