జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా
Actor ProfileActor

జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా
Chitrajyothy3 Aug 2026
జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా

ఎప్పుడూ లేనిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి మూవీ ఓపెనింగ్‌లో కనిపించి, అందరికీ షాక్ ఇచ్చారు. ఎప్పుడూ లేనిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి మూవీ ఓపెనింగ్‌లో కనిపించి, అందరికీ షాక్ ఇచ్చారు. వాస్తవానికి అల్లు అర్జున్ సినిమాల ఓపెనింగ్ టైమ్‌లో కూడా అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) కనిపించరు. కానీ, ఒక చిన్న సినిమా ఓపెనింగ్‌లో ఆమె కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలీ సినిమా టీమ్‌కు, ఆమెకు ఏమైనా బాండింగ్ ఉందా? అనేలా సెర్చ్ మొదలెట్టారు. వాస్తవానికి ఆమెకు ఈ సినిమా టీమ్‌తో ఏమీ బాండింగ్ లేదు. కానీ, ఈ సినిమా నిర్మాత అయినటువంటి సందీప్ రామినేని(శాండి) అల్లు అర్జున్‌కు స్నేహితుడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో.. ఆ బాధ్యతని అల్లు స్నేహ తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ వివరాల్లోకి వెళితే.. మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం (Maurya Siddavaram), త‌న్వి ఆకాంక్ష (Tanvi Aakanksha) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘జోకర్’ (Joker). ఈ సినిమా శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజరయ్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా.. అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాస్, ఎస్‌కెఎన్ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత సందీప్ రామినేని (Sandeep Ramineni) మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌గా ఉండబోతోంది. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే.. ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య‌, త‌న్వి జోడీ క్యూట్‌గా ఉంటుంది

జ కర ఓప న గ క అల ల స న హ ర డ డ అ ద క వచ చ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in