జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు
Actor ProfilePolitician

జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు
Andhra Jyothy29 Aug 2026
జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు

ఈ ఏడాది జూన్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.1.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 13 నెలల్లో జీఎ్‌సటీ ఆదాయానికిదే... జూన్‌ ఆదాయంలో 14% పెరుగుదల.. గడిచిన 13 నెలల్లో ఇదే అత్యధిక వృద్ధి న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.1.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 13 నెలల్లో జీఎ్‌సటీ ఆదాయానికిదే అత్యధిక వృద్ధి. దిగుమతులు, దేశీయ సరఫరాలపై పన్ను వసూళ్లు పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2025 జూన్‌లో జీఎ్‌సటీ స్థూల ఆదాయం రూ.1.71 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, ఈ మే నెలలో జీఎ్‌సటీ రెవెన్యూ రూ.1.94 లక్షల కోట్లుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్‌లో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్‌టీ వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో సెంట్రల్‌ జీఎ్‌సటీ రూ.37,376 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ రూ.45,116 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ రూ.52,282 కోట్లుగా ఉంది. దిగుమతులపై జీఎస్‌టీ వసూళ్లు 34.6 శాతం ఎగబాకి రూ.60,038 కోట్లకు పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ దేశంలోకి భారీగా దిగుమతులు జరుగుతున్నాయనడానికి ఇదే సంకేతమని పన్ను విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెల జీఎస్‌టీ రిఫండ్లు కూడా 29.1 శాతం పెరుగుదలతో రూ.32,436 కోట్లకు చేరాయి. రిఫండ్ల మినహాయింపు అనంతరం జీఎ్‌సటీ నికర వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూన్‌తో పోలిస్తే 11.2 శాతం అధికమిది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి జీఎ్‌సటీ మొత్తం వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 8.4 శాతం వృద్ధితో రూ.6.32 లక్షల కోట్లకు చేరాయి. అందులో దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన ఆదాయంలో 2.8 శాతం వృద్ధి నమోదు కాగా