జీఎస్ టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు
Actor ProfileActor

జీఎస్ టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీఎస్ టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు
Sakshi26 Jun 2026
జీఎస్ టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు

స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు సామర్థ్యం, యుటిలిటీ వాహనాలకు లభిస్తున్న ఆదరణ తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 4–6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఇక్రా’ తన నివేదికలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వాహనాల టోకు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధితో 4.4 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి లభించిన భారీ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, సుదీర్ఘ వివాహాల సీజన్‌ కారణంగా రిటైల్‌ విక్రయాలు 33 శాతం పెరిగాయి. అయితే, పెరుగుతున్న ఇంధన, కమొడిటీ ధరలతో పాటు బలహీనమైన రుతుపవనాలపై ఆందోళనలు రాబోయే కాలంలో నిశితంగా గమనించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది. యుటిలిటీ వాహనాల ఆధిపత్యం ‘‘ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో ఇవి దాదాపు 68 శాతం వాటాను దక్కించుకున్నాయి. అలాగే, గత ఏడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో మినీ, కాంపాక్ట్‌ కార్ల విభాగాల్లోనూ డిమాండ్‌ పుంజుకుంది’’ అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది. పెరిగిన ఎగుమతులు.. ఈవీల జోరు దేశీయ వాహన తయారీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ సరఫరాను ముమ్మరం చేయడంతో, ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగం కూడా పుంజుకుంది. 2027 ఆర్థిక సంవత్సర ఆరంభంలో ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో ఈవీల వాటా దాదాపు 6 శాతానికి చేరినట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు) జంగిల్ థీమ్‌తో

జ ఎస ట ఎఫ క ట ప ర గన న న క ర ల అమ మక ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in