జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
Actor ProfileActor

జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
Sakshi19 Aug 2026
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది

కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో నటిగా పరిచయమైంది. అలాంటి ఈమె.. పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అవ్వడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్') హీరోయిన్‌గా తొలి సినిమాతో గుర్తింపు వచ్చిన కొన్నాళ్లకు 'ఛలో' అంటూ రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి పేరుతో పాటు అద్భుతమైన అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగులోనే 'గీతగోవిందం' మూవీ ఈమె లైఫ్, కెరీర్ రెండింటిని మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈమె భర్త అయ్యాడు. ఇది బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.తెలుగులో మంచి సక్సెస్ కారణంగా బాలీవుడ్‌లోనూ రష్మికకు వరస ఛాన్సుల వచ్చాయి. యానిమల్, ఛావా చిత్రాలు ఈమెని పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజికి తీసుకెళ్లిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ టైంలో ఈమె చేసిన 'కాక్‌టెయిల్ 2' థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే భర్తతో చేసిన రణబాలి, లీడ్ రోల్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' రిలీజ్ కానున్నాయి. ఇదంతా చూస్తుంటే పదేళ్లలో రష్మిక జీవితం ఎంతలా మారిపోయిందో కదా! (ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు) ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల

జస ట పద ళ ల రష మ క ల ఫ మ ర ప య ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in