జలసంరక్షణకు జననేతల దీక్ష
Actor ProfilePolitician

జలసంరక్షణకు జననేతల దీక్ష

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జలసంరక్షణకు జననేతల దీక్ష
Eenadu23 Jul 2026
జలసంరక్షణకు జననేతల దీక్ష

తుంగభద్ర డ్యాం కొత్తగేట్ల ప్రారంభం ఇదే సహకారంతో జల వివాదాలూ పరిష్కరించుకోండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సూచన సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే.. ప్రధాని మోదీ సాకారం చేస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కమిటీ ఏర్పాటు చేసి, జల వివాదాలను పరిష్కరించాలి కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రైతుల కోసం ఒక్కటయ్యామన్న కర్ణాటక సీఎం శివకుమార్‌ తుంగభద్ర గేట్లను మీట నొక్కి ప్రారంభించిన అనంతరం అభివాదం చేస్తున్న రామానాయుడు, సీఆర్‌ పాటిల్, డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌ ఈనాడు, బెంగళూరు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర 73 ఏళ్ల తర్వాత కొత్త శోభను సంతరించుకుంది. ఏడు దశాబ్దాలుగా మూడు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించిన ఈ ఆనకట్టకు కొత్తగా అమర్చిన 33 స్పిల్‌వే గేట్ల పునరుద్ధరణ, వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఓ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. తుంగభద్ర ఆనకట్ట విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి వచ్చి జల సంరక్షణ కోసం సంఘీభావాన్ని ప్రకటించారు. కర్ణాటకలోని హొసపేటె సమీప తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్‌ గురువారం ప్రారంభించారు. 17, 18, 19, 20 గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి వీటిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కర్ణాటక విధానపరిషత్తు స్పీకర్‌ బసవరాజ హొరట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక జలవనరుల శాఖ, తుంగభద్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్‌ను ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు అన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటక, ఆంధ్ర

జలస రక షణక జనన తల ద క ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in