
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jagtial Kendriya Vidyalaya Latest News: జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఎనిమిది నెలలుగా కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియల వల్ల కొంత ఆలస్యం జరగడం వాస్తవమేనని.. అయితే, దీన్ని రాజకీయం చేస్తూ.. కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పండ్ల మార్కెట్ కొరకు వాలంతరి భూమిని కేటాయించినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసినప్పటికీ స్థల మార్పిడిలో తీవ్ర ఆలస్యమైందనే విషయాన్ని మీడియా మిత్రులు, అధికారులు గమనించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తుచేశారు. వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ (వాలాంతరి) అనేది ఒక అటానమస్ సంస్థ అని.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శాస్త్రవేత్తల శిక్షణ నిమిత్తం ఆ భూమి కేటాయింపులో కొంత జాప్యం జరిగిందని వివరించారు. కొందరు పూర్తి అవగాహన లేకుండా తెలిసి తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు క్యాబినెట్ ఆమోదం.. కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కొరకు పాత ఎస్పీ కార్యాలయాన్ని కేవీ డిప్యూటీ డైరెక్టర్, డీఈఓ, కలెక్టర్‌తో పాటు కరీంనగర్