జగన్ సార్'.. బసవతారకం వేదిక
Actor ProfilePolitician

జగన్ సార్'.. బసవతారకం వేదిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే
AP7AM13 Jul 2026
జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే

తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుప‌త్రి ఇటీవల తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన అనంతపురానికి చెందిన స్వప్న అనే యువతి పంచుకున్న అనుభవాలు అందరినీ కదిలించాయి. అయితే, తన ప్రసంగంలో ఆమె 'జగన్ సార్'కు కృతజ్ఞతలు చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది వైసీపీ అభిమానులు ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారని భావించి ఆ వీడియోను షేర్ చేశారు. కానీ, అసలు విషయం వేరే ఉంది. ఆమె ప్రస్తావించింది నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, అత్యంత సన్నిహితుడైన అనంతపురం జగన్ అలియాస్ జగదీష్ గురించి. ఈ గందరగోళంతో 'అనంతపురం జగన్' పేరు ఒక్కసారిగా వైరల్ అయింది.ఎవరీ 'అనంతపురం జగన్'?ఈ ఘటనతో అసలు ఎవరీ 'అనంతపురం జగన్', బాలకృష్ణకు ఆయనెలా అంత దగ్గరయ్యారని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. జగదీష్ అలియాస్ అనంతపురం జగన్, నందమూరి బాలకృష్ణకు కేవలం అభిమాని మాత్రమే కాదు, ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి. బాలయ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా జగన్ ఆయన వెంటే ఉంటారు. తన తండ్రి 2004లో మరణించగా, ఆ స్థానంలో బాలకృష్ణే తన కుటుంబానికి అండగా నిలిచారని జగన్ పలు సందర్భాల్లో ఉద్వేగంగా చెప్పారు. బాలకృష్ణను ఆయన కేవలం అభిమాన నటుడిగానే కాకుండా, ఒక తండ్రిలా, గురువులా భావిస్తారు.బాలకృష్ణ స్ఫూర్తితోనే 'NBK Helping Hands' అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో

జగన స ర బసవత రక వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in