జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి
Actor ProfileCelebrity

జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి
NTV Telugu7 Aug 2026
జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి

వారణాసి టీం ఎప్పుడు అంటార్క్టికా వెళ్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తే జక్కన్న షాక్ ఇచ్చాడు. వారణాసి టీం ఇచ్చిన అప్డేట్ తో అంటార్క్టికా స్కెడ్యూల్ లేదని తేలిపోయిందా? ఇంతవరకు ఎవరు తీయని లొకేషన్ కి వెళ్తారునుకుంటే మంచు ఖండాన్ని గ్రీన్ మాట్ లో చూపించేశారా? ఒరిజినల్ ఒరిజినలే, డూప్లికేట్ డూప్లికేటే. సినిమా భాషలో చెప్పాలంటే లైవ్ లొకేషన్స్ లైవ్ లొకేషన్స్ే, విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ఏ. ఇది రాజమౌళికి తెలియంది ఏం కాదు. ఎలాంటి సీన్స్ గ్రీన్ మాట్ లో తీయాలో, ఎలాంటి సీన్స్ లొకేషన్స్ లో తీయాలో బాగా తెలిసిన రాజమౌళి వారణాసి షూటింగ్ కోసం అంటార్క్టికా వెళ్లి షూటింగ్ చేయాలనుకున్నాడు. రిస్కీ ఫీటే చేయాలనుకున్నా కుదరలేదు. లైవ్ లొకేషన్స్ లో తీసిన సినిమాలు ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలో విహరించేలా చేశాయి. ‘కాంతార చాప్టర్ వన్’ షూటింగ్ చాలా వరకు అడవుల్లో చిత్రీకరించాల్సి రావడంతో సెట్స్ జోలికి పోకుండా ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. నాచురాలిటీ కోసం వారణాసి యూనిట్ మంచు ఖండానికి వెళ్ళాలనుకున్నా, విఎఫ్ఎక్స్ తో సరిపెట్టుకున్నారు. వారణాసికి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ లో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఈ లెక్కన అంటార్క్టికా సీన్స్ ని కూడా ఇక్కడే స్టూడియోలో గ్రీన్ మాట్ లో తీసేసారట. షూటింగ్ ఆగస్టుకు పూర్తవుతుంది అనుకుంటే, రెండు నెలలు ఆలస్యంగా గుమ్మడికాయ కొడుతున్నారు

జక కన న ఇల ష క చ చ డ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in