
సినీరంగంలో ఆ ఇద్దరూ స్టార్ హీరోహీరోయిన్స్. అయినప్పటికీ ఆమెతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఆ హీరో ఆసక్తి చూపించలేడు. అందుకు కారణం ఆమె నోటి నుంచి వచ్చిన దుర్వాసన. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో బయటపెట్టాడు. 1997లో విడుదలైన, రాజీవ్ రాయ్ దర్శకత్వం వహించిన విజయవంతమైన బాలీవుడ్ చిత్రం 'గుప్త్: ది హిడెన్ ట్రూత్'. ఇందులో యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ హీరోగా నటించారు. అలాగే ఈ మూవీలో కాజోల్, మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రంలోని ఒక సన్నివేసంలో మనీషా కొయిరాలతో బాబీ డియోల్ లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సీన్ చేయడానికి బాబీ డియోల్ ఇష్టపడలేదట. దీని గురించి బాబీ డియోల్ మాట్లాడుతూ, "ఆప్ కి అదాలత్' షూటింగ్ ప్రదేశం చల్లగా ఉండేది. అక్కడ ఎవరో చాట్ అమ్ముతున్నారు. మనీషా కొయిరాలా దాన్ని కొని రుచి చూసింది. ఒక పాట సన్నివేశంలో మనీషా కొయిరాలాతో నేను లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఆమె వద్ద ఉల్లిపాయ వాసన వచ్చింది. అందుకే ఆ సీన్ చేయనని చెప్పాను" అని అన్నారు బాబీ డియోల్. ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్.. అలాగే.. "కాలేజీలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అందులో మనీషా సోదరుడు వచ్చి నన్ను కొట్టాల్సి ఉంది. అతను కొత్త నటుడు. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే బాగా నటించగలవని నేను అతనికి చెప్పాను. నేను అతని చేత చాలా ఉల్లిపాయలు తినిపించాను. ఆ సన్నివేశం వచ్చినప్పుడు, అతని నుండి ఉల్లిపాయ వాసన వచ్చింది. చిన్న వయసులో పరిణితి ఉండదు. అంతే" అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 'పర్సాద్' చిత్రంలో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కుమార్తె ట్వింకిల్‌తో జరిగిన గొడవ గురించి బాబీ