మీనాక్షికి శిక్ష పడకుండా కోర్టులో సాక్ష్యం చెప్తామని చెప్పిన సుబ్బారావు.. చివర్లో హ్యాండ్ ఇవ్వడంతో మీనాక్షి జైలు పాలైంది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఈరోజు (జూన్ 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ఓ పక్క మీనాక్షి జీవితం జైల్లోనే సమాధి కావాలని కుట్రలు చేస్తున్న పల్లవి.. పైకి మాత్రం భరత్‌ని నమ్మించడానికి ఆమెపై దొంగ ప్రేమ నటిస్తుంది. భరత్ ముందు జైలర్‌కి ఫోన్ చేసి.. మీనాక్షికి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని.. ఆమెకి జైల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తెగ నటిస్తుంటుంది. చూశావా భరత్.. ‘మీ అమ్మ గురించి నేను ఎంత కేరింగ్ తీసుకుంటున్నానో చూశావా.. నువ్వు మీ అమ్మ గురించి టెన్షన్ పడొద్దు.. నేను చూసుకుంటా.. అవనిని జైలుకి పంపించడంతోనే మా అమ్మ ఆత్మశాంతిస్తుంది. మీ అమ్మకి తప్పకుండా రిలీజ్ చేయిస్తాను.. దానికి కొంచెం టైమ్ పడుతుంది.. ఓపికపట్టు అని అంటుంది పల్లవి. దాంతో భరత్.. ‘థాంక్యూ సిస్టర్.. మీ అమ్మ గురించి ఇంత ఆలోచిస్తావ్’ అని అనుకోలేదు అని అంటాడు భరత్. కట్ చేస్తే.. అవని జైల్లో ఉన్న మీనాక్షిని కలుస్తుంది. తల్లిని చూడగానే తల్లడిల్లిపోతుంది అవని.నిన్ను జైలు నుంచి విడిపిస్తాను.. నువ్వేం బాధపడొద్దమ్మా.. నిన్ను తప్పకుండా రిలీజ్ చేయిస్తాను. నేరం చేసింది నువ్వు కాదని నిరూపిస్తాను.. నీకేం కాదు.. ధైర్యంగా ఉండు’ అని అంటుంది అవని. సర్లే అవనీ.. నా జీవితం ఇంతే అనుకున్నా.. నేను పోతేనైనా ఆ పల్లవికి నీపై కోపం తగ్గుతుందేమో.. నాకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకు వదిలెయ్ అని అంటుంది మీనాక్షి. ‘ఏంటమ్మా ఇదీ.. కూతుర్ని కాపాడటం కోసం నేరం నీపై వేసుకున్నావ్.. ఆ పల్లవి ఏం చేసినా సరే.. నిన్ను నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను’ అంటూ పాడినపాటే మళ్లీ పాడుతుంది అవని. అవసరం అయితే నీకోసం నా ప్రాణం ఇస్తానమ్మా.. నా తల్లి రుణం తీర్చుకుంటాను’ అని ఎమోషనల్ అవుతుంది అవని
Actor ProfileActor
చావు అంచుల్లో మీనాక్షి.. చక్రధర్ రెండో భార్య కూడా ఔట్.. ద్యావుడా
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Jun 2026
చావు అంచుల్లో మీనాక్షి.. చక్రధర్ రెండో భార్య కూడా ఔట్.. ద్యావుడా