చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే
Actor ProfileActor

చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్ బ్లాక్ బస్టర్ తో ట్రెండ్ సెట్ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే
Asianet News Telugu26 Aug 2026
చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్ బ్లాక్ బస్టర్ తో ట్రెండ్ సెట్ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే

చిరంజీవి కెరీర్‌లో చాలా సినిమాలు మిస్‌ చేసుకున్నారు. అందులో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన మూవీస్‌ కూడా ఉన్నాయి. అలానే ఒక మంచి బ్లాక్‌ బస్టర్‌ని వదులుకున్నారు. తన కెరీర్‌లో మొదటి సారి ఒక హర్రర్‌ ఫిల్మ్ ని ఆయన రిజెక్ట్ చేశారు. ఇదే సినిమాని రీమేక్‌ చేసి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. ట్రెండ్‌ సెట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌. టాలీవుడ్‌ లెక్కలు మార్చిన హీరోగా చెప్పొచ్చు. పరిశ్రమ ని కమర్షియల్‌ బాట పట్టించిన హీరోగా నిలిచారు. ఎన్టీఆర్‌ తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి నిలుస్తారు. అదే సమయంలో కృష్ణ కూడా ఇలాంటి సినిమాలు చేశారు, కానీ ఆయన్ని మించేలా చిరంజీవి ఫక్తు కమర్షియల్‌ మూవీస్‌తో కాసుల వర్షం కురిపించారు. చిరంజీవితో సినిమా చేస్తే మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ అప్పట్లో ఉండేది. ఆయన చేసిన సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లని రాబట్టాయి. ఇదిలా ఉంటే చిరంజీవి ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌తోనే విజయాలు అందుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.కానీ కమర్షియల్‌గా నష్టాలను తీసుకొచ్చాయి. మైథాలజీ మూవీస్‌, ఫాంటసీ చిత్రాలు కూడా ఆయనకు కలిసి రాలేదు. సైరా నరసింహా రెడ్డి లాంటి మూవీస్‌ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే టాలీవుడ్‌లోనే ఒక ట్రెండ్‌ సెటింగ్‌ ఛాన్స్ చిరంజీవికి వచ్చింది. ఆయన భయపడి సినిమా చేయలేదు. అదే `చంద్రముఖి`. ఈ మూవీ మలయాళంలో వచ్చిన `మనితిట్రతజు` అనే చిత్రానికి రీమేక్‌. అందులో మోహన్‌లాల్‌, సురేష్‌ గోపీ, శోభన నటించారు. అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయాలని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ప్లాన్‌ చేశారు. చిరంజీవి వద్దకు వెళ్లి కథ చెప్పగా, ఆయన భయపడి రిజెక్ట్ చేశారు. తనకు ఈ హర్రర్‌ మూవీ సెట్ కాదని

చ ర జ వ భయపడ ర జ క ట చ స త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in