
మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించే పుస్తకాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు... మెగాస్టార్ చిరంజీవికి అందచేశారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని తెలంగాణ బీజేపీ నేతలు ఆయన ఇంటిలో కలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) నాయకత్వంలో వికాస్, విశ్వాస్, జన కల్యాణ్ 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ప్రభుత్వ ముఖ్య విజయాలు, మైలురాళ్లను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు (N. Ramachandra Rao) అందచేశారు. ఇదే సమయంలో సినిమాలు, దేశ నిర్మాణంపై చిరంజీవితో అర్థవంతమైన చర్చ కూడా జరిగిందని రామచంద్రరావు తెలిపారు. మోదీ సేవాకాలం భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. చిరంజీవితో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్, కార్యదర్శులు భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. Swetha Menon: కీలుబొమ్మను కావాలనుకోవడం లేదు