చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్
Actor ProfileActor

చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్

Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే
Asianet News Telugu17 Jun 2026
చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు హీరోలు పోటా పోటీగా సినిమాలు చేస్తూ.. మంచి ఫామ్ లో ఉండగానే.. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గరు హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గట్టిగా నడిచింది. మల్టీ స్టారర్లు చేస్తూ.. కృష్ణ ‌- శోభన్ బాబు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేవారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు మధ్య కూడా యుద్ద వాతావరణం ఉండేది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఫామ్ లో ఉండగానే చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని వెస్ట్రన్ డ్యాన్స్, యాక్షన్ సీన్స్ రుచి చూపించి మాస్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు. చిరంజీవికి పోటీ ఇవ్వడానికి కృష్ణ, శోభన్ బాబు తమ రూటు మార్చుకోవలసి వచ్చింది. చిరంజీవి జోరుకు బ్రేక్స్ వేయడానికి కృష్ణ శోభన్ బాబు చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కో సారి వారి ప్రయత్నాలు ఫలించినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం చిరంజీవి సినిమాల వల్ల చావు దెబ్బ తినక తప్పలేదు. శోభన్ బాబుకి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండేది. ఎక్కవగా ఆయన కుటుంబ కథా చిత్రాలు చేసేవారు. శోభన్ బాబుతో ఫ్యామిలీ ఓరియోంటెడ్ సినిమాలు చేసిన దర్శకులే చిరంజీవితో పక్కా మాస్ సినిమాలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి దర్శకులలో కోదండరామరెడ్డి కూడా ఒకరు. చిరంజీవి ఇండస్ట్రీలో నిలబడి స్టార్ గా మారడానికి కోదండరామిరెడ్డి సినిమాలే కారణం. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛాలెంజ్ సినిమా సంచలన విజయం సాధించింది. రికార్డులు బ్రేక్ చేసింది. ఈమూవీ చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఛాలెంజ్ సినిమా రిలీజ్ కు వారం ముందు శోభన్ బాబు ఇల్లాలు ప్రియురాలు సినిమా రిలీజ్ అయ్యింది. కుటుంబ కథా చిత్రం కావడంతో.. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఛాలెంజ్ రిలీజ్