
Telugu Times•15 Jun 2026
చీరకట్టులో చక్కని తెలుగు ఆడపడుచులా సమంతఏ మాయ చేసావె(Ye Maya Chesave) సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సమంత(Samantha) చాలా రోజుల తర్వాత తెలుగులో మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమాతో ప్రేక్షకుల్ని సమంత పలకరించబోతుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సమంత, ప్రమోషన్స్ లో భాగంగా ఎంతో అందంగా కనిపిస్తోంది. లైట్ గ్రీన్ కలర్ చెక్స్ తో డిజైన్ చేసిన చీరకు రెడ్ కలర్ బోర్డర్, దానికి మ్యాచింగ్ గా రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని తెలుగింటి ఆడపడుచులా ఎంతో అందంగా మెరిసిపోయింది. ఈ లుక్ లో సమంతను చూసిన నెటిజన్లు కుందనపు బొమ్మలా ఉందని కామెంట్స్ చేస్తూ, ఆమె ఫోటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు